న్యూఢిల్లీ: పంజాబ్ – హర్యానా హైకోర్టు ఆదేశాలతో హర్యానాలోని నూహ్‌లో కూల్చివేతలకు బ్రేక్‌పడింది. నూహ్, గురుగ్రామ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతపెద్ద సహా ఆరుగురు మృతిచెందారు. భారీగా ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను సుమోటోగా తీసుకున్న పంజాబ్ -– హర్యానా హైకోర్టు.. వెంటనే ఇండ్ల కూల్చివేతలను నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ కూల్చివేతలను చేపట్టవద్దని ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కూల్చివేతలను నిలిపివేయాలని డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత సంబంధిత అధికారులను ఆదేశించారు.
