యూపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

యూపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

యూపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ అల్లర్ల ప్రధాన సూత్రధారి జావేద్ అహ్మద్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చి వేశారు. అక్రమంగా నిర్మించిన ఇల్లు కావడంతో అధికారులు రెండు రోజుల ముందే నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల్లోగా స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథార్టీ (PDA) సూచించింది. ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జావేద్ అహ్మద్ ఇల్లును కూల్చివేశారు.

శుక్రవారం నగరంలో చెలరేగిన హింసకు మాస్టర్ మైండ్ జావెద్ అహ్మద్ కారకుడిగా గుర్తించారు. అతనితో పాటు మరింత మంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి శనివారం జావేద్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రయాగ్ రాజ్ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 304 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో 91 మంది, సహరాన్ పూర్ లో 71, హత్రాస్ లో 51, మొరదాబాద్ లో 34 మంది, ఫిరోజాబాద్ లో 15, అంబేద్కర్ నగర్ లో 34 మంది నిందితులున్నారు. ఈ కేసులో 13 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 5 వేల మందికిపైగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు అన్నారు.