అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు. ఏడాది ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ, రుణమాఫీ లాంటి భారీ కార్యక్రమాలు అమలు జరగడమే అందుకు సాక్ష్యం. దార్శనిక నాయకుడు ఎలా ఉండాలో, ఇచ్చినమాట ఎంత విలువైనదో సీఎం రేవంత్ రెడ్డిని చూసి చెప్పొచ్చు. పరిపాలనా అనుభవం లేదంటూ ప్రతిపక్షాలు చేసిన రాద్దాంతాలన్నీ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజునే కొట్టుకుపోయా యి. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపే తెలంగాణ ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి నిరూపించుకున్నారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెలను బద్దలుకొట్టి ప్రజాపాలనకి నాంది పలికి కేసీఆర్ దొర నిర్మించుకున్న ప్రగతి భవన్‌ను సామాజిక అంతరాలు లేని ప్రజావాణిగా మార్చారు. అలాగే తొలిరోజే అమలుచేసిన 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఎంతోమంది నిరుపేదల జీవితాలకు సాంత్వన చేకూర్చి వారిని ఆరోగ్యవంతుల్ని చేసింది.
గత బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల రుణమాఫీని విడతలవారీగా చేసి అసలు మాఫీ అయిందో, మిత్తీ మాఫీ అయిందో కూడా అర్థంకాని పరిస్థితుల్లో అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అయితే, రేవంత్ దమ్మున్న నాయకుడి మాట ఎంత విలువైనదో నిరూపిస్తూ.. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. కేవలం 15 రోజుల్లోనే తెలంగాణ రైతన్నల ఖాతాల్లోకి దాదాపు 18వేల కోట్లకు పైగా జమచేసింది. గతంలో రైతన్నల పేరు చెప్పి.. పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరి కాళేశ్వరాన్ని నిర్మించి కమీషన్లు దండుకొని కూల్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు రైతన్నలకు మేలు చేస్తున్నామంటూ తమ బొక్కసాలు నింపుకున్నారు. కానీ, నేడు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ స్థిరీకరణ, మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లు చేస్తూ రైతుకు నిజంగా ఏంకావాలో చేసి చూపిస్తున్నారు. రైతు కమిషన్, సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ లాంటి అద్భుతమైన కార్యక్రమాలతో తెలంగాణ రైతులను సుసంపన్నం చెయ్యాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.
చేనేతకు చేయూత
300 కోట్ల చేనేత బకాయిలను, 60 కోట్ల చేనేత రుణమాఫీని విడుదల చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌దే. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. మొన్నటికి మొన్న వేములవాడ రాజన్న చెంత యార్న్ డిపోను రూ.50 కోట్లతో ఏర్పాటు చేశారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పునరుద్ధరించారు. ఇలా పోచంపల్లి, సిరిసిల్ల, సూర్యాపేటలతో పాటు రాష్ట్రం మొత్తం నేతన్నలకు బాసటగా నిలిచి వారి కడుపు నింపే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేస్తోంది ప్రజాప్రభుత్వం.
గడీలను బద్దలు కొట్టి ఆత్మగౌరవం నిలిపింది
దెబ్బతిన్న ఆత్మగౌరవం తిరిగి నిలబడ్డది
గత పదేండ్లలో ఆత్మగౌరవం అన్నమాటకు అర్థమే మార్చేశారు. తెలంగాణలో ఏ ఆత్మగౌరవం కోసం యావత్ తెలంగాణ పోరుబాట పట్టి స్వయం పాలన సాధించుకుందో... గత బీఆర్ఎస్ పాలనలో దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. మామూలు వ్యక్తులు మొదలు మంత్రుల వరకూ అవమానభారంతో ఎంతగా రగిలిపోయారో.. నాడు పత్రికల్లో ‘ప్రగతి భవన్‌కు ఎంట్రీ లేని మంత్రి’, ‘సీఎం అపాయింట్మెంట్ కోసం గేటుముందు గద్దరన్న అగచాట్లు’ అంటూ వచ్చిన వార్తల్ని మనందరం చదివాం. ఎమ్మెల్యే, మంత్రులకు సైతం అందుబాటులో లేకుండా యావత్ తెలంగాణను తన సొంత జాగీరులా ఆ నలుగురు ఏలిన విధానాన్ని మనం చూశాం. అందుకే వాళ్లు కట్టుకున్న గడీలు బద్దలుకొట్టి మరీ రేవంతన్న తెలంగాణకు ఆత్మగౌరవాన్ని అందించారు.
విద్య, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
విద్యాశాఖ వంటి కీలక విభాగాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తూ కొలువుదీరిన ఎనిమిది నెలల్లోనే 11,063 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఏడాదికి 2 సార్లు టెట్, విద్య కమిషన్, అమ్మ ఆదర్శ పాఠశాలలు,40 డైట్ చార్జీల పెంపు ఇలా నూతన మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయాలను అభినందించాల్సిందే. 13 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న 30 వేల టీచర్ల ప్రమోషన్స్‌ను పూర్తి చేశారు. విద్యకు బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ. 21,292 కోట్లు కేటాయించారు. ఆత్మన్యూనత భావాన్ని పొగుడుతూ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా 65 ఐటీఐలను నెలకొల్పారు. ఏడాదికి 2సార్లు టెట్, విద్య కమిషన్... ఇలా నూతన మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయాలను అభినందించాల్సిందే. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. యూనివర్సిటీల్లో సామాజిక న్యాయం పాటిస్తూ వీసీలను నియమించారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను నెలకొల్పుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలను తెలంగాణ విద్యావ్యవస్థలోకి తీసుకొస్తున్నారు.
సింగరేణికి పునరుజ్జీవం
ఏడాది రేవంత్ పాలనలో సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ నియామకాలు, కారుణ్య నియామకాల వయస్సు 35 నుంచి 40కి పెంపుదల, స్థానికతకు 80% ప్రాధాన్యత ఇచ్చారు. కార్మికులకు బోనస్, కోటి ప్రమాద బీమా వంటి కార్యక్రమాలతో తెలంగాణకు మనోహరమైన సింగరేణికి పునరుజ్జీవం పోశారు.
మహిళలను సంపన్నులను చేయడం
సమాజంలో సగమైన మహిళా మణులకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. సెర్ప్ ద్వారా ఒక కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా మహిళా శక్తి కార్యక్రమం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రూ.1747 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను 57,512 సంఘాలకు అందజేశారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా 63.86 లక్షల మందికి మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫాం కుట్టు బాధ్యతలు ద్వారా 28,200 సంఘాలకు లబ్ధి, శిల్పారామం వద్ద మహిళా బజారు, ఇందిర మహిళా డైట్ ప్రాజెక్ట్ ద్వారా 40,000 మందికి లబ్ధి చేకూర్చి రేవంత్ రెడ్డి సర్కార్ మహిళా పక్షపాతిగా గుర్తింపు పొందారు.
ప్రజల కోసం ప్రజాపాలన
భవిష్యత్తులో టూరిజం ఆధారంగానే ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ చేరుకుంటుంది. ఈ సత్యం తెలిసిన ప్రభుత్వం కనుకనే మూసీ పునరుజ్జీవన పథకాన్ని రేవంత్ సర్కారు ముందుకుతెచ్చింది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, వారి జీవనోపాధికి ఉదారంగా సాయం, బ్యాంకు రుణాలను ఇప్పిస్తోంది. ఈ ఏడాది కాలాన్ని మననం చేసుకుంటే ప్రజాపాలన సాధించిన ఎన్నో అద్భుతాలు మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తెలంగాణకు శ్రీరామ రక్షలా మారింది.
50వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఒక్కసారి కూడా విడుదలకాని గ్రూప్1 పరీక్షను భారీ స్థాయిలో 563 పోస్టులతో వెలువరించడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించారు. కేవలం ఆరునెలల్లోనే 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ మొదలు నియామక పత్రం అందించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది ప్రజా ప్రభుత్వం. ఏ మాత్రం బేషజాలకు పోకుండా డీఎస్సీ కోసం గ్రూప్ 2ను వాయిదా వేయమన్న అభ్యర్థుల కోరికలను మన్నించి డిసెంబర్ 15న దాన్ని నిర్వహిస్తున్నారు. పోలీస్, గ్రూప్ 4, వైద్య ఇలా అన్ని రంగాల్లో కలిసి కేవలం తొమ్మిది నెలల్లోనే 50వేల పైచిలుకు ప్రభుత్వోద్యోగాలను తెలంగాణ బిడ్డలకు అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.
- పున్నాకైలాష్ నేత, టీపీసీసీ, జనరల్ సెక్రటరీ