కరోనా మహమ్మారిని అరికట్టడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని , అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ ఆరోపించారు. వైరస్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 2.05 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని , దీనివల్ల నిరుద్యోగ రేటు ఇప్పుడు 14.7 శాతానికి పెరిగిందన్నారు.
నిరుద్యోగ రేటు ఇప్పుడున్న ఆర్ధిక విపత్తుకంటే ఘోరమైందన్నారు. మహమ్మారి నుంచి ప్రజల్ని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని కాపాడడంలో ట్రంప్ విఫలమయ్యారన్న ఆయన…దేశ వినాశకరమైన ఆర్ధిక వ్యవస్థ కు మూల కారణం ట్రంపేనన్నారు.
కరోనా ఆర్ధిక స్థితిగతులకు సవాలేనన్న బిడెన్..గత మూడేళ్లుగా ట్రంప్ దేశ ఆర్ధిక మూలాల్ని దెబ్బతీశారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే ట్రంప్ తన నిర్ణయాలతో చిరువ్యాపారాలు రోడ్డు పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. హోం డెలివరీ కారణంగా చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారని..భవిష్యత్ లో అవిమళ్లీ తిరిగిపుంజుకోవడం కష్టమేనేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
కరోనా కష్టకాలంలో ట్రంప్ యెక్క మూడు ఆర్ధిక విధానాలు అమెరికాను సంక్షోభంలోకి నెట్టేశాయన్నారు. స్టాక్ మార్కెట్ల అంచనా, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా విధానాలు, మధ్యతరగతి కుటుంబాల్ని విస్మరించారని చెప్పిన బిడెన్..
