లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్​

ఆదిలాబాద్: ఎస్టీ జాబితా నుంచి  లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి.  ఆదిలాబాద్ జిల్లా బంద్ కు  పిలుపునిచ్చాయి.  ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు.  బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.  ఇక బంద్ నేపథ్యంలో దుకాణాలు తెరచుకోలేదు.  

 సందర్భంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ మాట్లాడుతూ.. జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.  వలస లంబాడీలను  ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజికవర్గాన్ని తొలగించి  తమకు న్యాయం చేయాలన్నారు. 

ఇతర రాష్ట్రాలలో బీసీ, ఎస్సీగా ఉన్న ఆ సామాజికవర్గం, రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో కొనసాగుతుండటం వల్ల ఆదివాసీలు  బెనిఫిట్​స్కీమ్​ లు అందడం లేదన్నారు.