బస్సు పునరుద్ధరించాలని ధర్నా

ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలం జూలపల్లి మీదుగా నడుస్తున్న మహేశ్వరం డిపో బస్సును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్  చేస్తూ శుక్రవారం మండలంలోని చంద్రదన గ్రామంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుకొండపేట నుంచి అఫ్జల్ గంజ్  వరకు జూలపల్లి మీదుగా నడుస్తున్న బస్సును అధికారులు రద్దు చేశారని దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్  చేశారు. ఈ విషయమై డీఎంను ఫోన్​లో సంప్రదించగా బస్సును పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శ్రీకాంత్ గౌడ్, అనిల్ కుమార్, వెంకటేశ్, రాఘవేందర్, విజేందర్, యాదయ్య, శ్రీను, నరసింహ, చంటి పాల్గొన్నారు.