బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి..స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు

  • స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు  

న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించేందుకు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బడుల్లో బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పాలని, అక్కడి స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. అదేవిధంగా బంగ్లాదేశ్ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయొద్దని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. ‘‘బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పిల్లలకు స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వొద్దు. 

ఇప్పటికే ఎవరైనా అడ్మిషన్ పొందారో గుర్తించాలి. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. దీనిపై ఈ నెల 31లోగా రిపోర్టు సమర్పించాలి. అలాగే బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారో గుర్తించాలి. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి, ప్రతి శుక్రవారం రిపోర్టు అందజేయాలి” అని సర్క్యులర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.