మరోసారి ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు

మరోసారి ఎమ్మెల్సీ  కవిత రిమాండ్ పొడిగింపు

సీబీఐ కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ ,సీబీఐ  కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యూడిషియల్ కస్టడీ మే 20 తో ముగియనుంది. దీంతో ఇవాళ కవితను వర్చువల్ గా  కోర్టులో హాజరుపరిచారు తిహార్ జైలు  అధికారులు. దీంతో సీబీఐ కేసులో  మరో 14 రోజులు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. 

2024  మార్చి 15 న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి, అదేరోజు రాత్రి ఢిల్లీకి తరలించారు.  మార్చి 16 న కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడీషియల్ రిమాండ్​ విధించింది.

 కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11 న (రంజాన్ రోజు) కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్​ కస్టడీ నేటి (సోమవారం)తో ముగియనుంది.