దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే గంట గంటకు కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. లేటెస్టుగా కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య విభాగం ఇవాళ (సోమవారం) ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. ఇందులో 12 మంది ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ఆరోగ్య విభాగం తెలిపింది. ఇంకా 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పింది.
విదేశాల నుంచి వస్తున్న వారిలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ రోగులకోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉండే మూడు ప్రైవేటు ఆస్పత్రులకు సూచించింది.
