ప్రముఖ స్వీడిష్ యువ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ వెనుక కుట్ర ఉందంటూ… IPS 120-B, 153-A సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. మొన్న రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేయగా… ఇవాళ(గురువారం) జనవరి 16వ తేదీన జరిగిన సంఘటనలున్న పేజీని షేర్ చేసింది. ఆ తర్వాత టెక్నికల్ ఇబ్బందులతో ఆ ట్వీట్‌ను తొలగించి… అప్‌డేట్ చేసి పోస్ట్ చేసింది.
