రూ.7 లక్షలు ఇస్తే నీట్ పరీక్ష రాసిపెడ్తం..ఎయిమ్స్ స్టూడెంట్ల దందా

రూ.7 లక్షలు ఇస్తే  నీట్ పరీక్ష రాసిపెడ్తం..ఎయిమ్స్ స్టూడెంట్ల దందా
  •     ఎయిమ్స్ స్టూడెంట్ల దందా.. అరెస్ట్  చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షలో రిగ్గింగ్​కు పాల్పడుతున్న ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో రేడియాలజీ సెకండియర్ చదువుతున్న నరేశ్ బిష్రోయ్ అనే స్టూడెంట్​ఈ రాకెట్​కు లీడర్ అని చెప్పారు. డబ్బు ఆఫర్ చేసి ఎయిమ్స్​లో చదివే ఫస్టియర్ స్టూడెంట్లను తన గ్యాంగ్​లో చేర్చుకున్నాడని, వాళ్లతో నీట్ రాయించినట్లు తేలిందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ‘‘నీట్​లో ఎలాగైనా ర్యాంక్ కొట్టాలని అడ్డదారులు వెతికే కొంతమంది స్టూడెంట్ల నుంచి బిష్రోయ్ రూ.7 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. వాళ్ల స్థానంలో ఫస్టియర్ స్టూడెంట్లతో పరీక్ష రాయించాడు” అని పోలీసులు తెలిపారు. బిష్రోయ్ ఇలా దేశవ్యాప్తంగా పరీక్షలు రాయించాడని చెప్పారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు అభ్యర్థికి బదులుగా సంజు అనే ఫస్టియర్ స్టూడెంట్​ హాజరై దొరికిపోయాడని, అతడిని విచారించగా ఈ రాకెట్ గుట్టు బయటపడిందని పోలీసులు తెలిపారు.