దీప్ సిద్ధూ ఆచూకీ తెలిపితే రూ. ల‌క్ష రివార్డు: ఢిల్లీ పోలీసులు

దీప్ సిద్ధూ ఆచూకీ తెలిపితే రూ. ల‌క్ష రివార్డు: ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ: రిపబ్లిక్ డే అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కుంటున్న పంజాబీ న‌టుడు దీప్ సిద్ధూపై ఢిల్లీ పోలీసులు రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. సిద్ధూతో పాటు మ‌రో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్ర‌క‌టించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోటపై సిక్కు జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధూ మిగ‌తా వారిని ప్రేరేపించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆ ఘ‌ట‌న జ‌రిగినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధూ ఆచూకీ ల‌భించ‌లేదు. సిద్దూతో పాటు జెండా ఎగుర‌వేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. ఇంకో నలుగురు జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో అల్లర్ల తర్వాతి నుంచి వీరంతా పరారీలో ఉన్నారు.