ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది

ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది.  ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్ ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.  ఢిల్లీలోని యమునా నది  ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. డెహ్రాడూన్ లో వరద ఉధృతికి బస్సు కాలువలో చిక్కుకుంది. ఢిల్లీలో ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. 

ఢిల్లీలో యుమునా ఉధృతంగా ప్రవహిస్తోంది.  నిన్న రాత్రి డేంజర్ మార్క్ 205.33 మీటర్లు దాటింది. పాత రైల్వే వంతెన దగ్గర దగ్గర 206 మీటర్లుగా నమోదైంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. యమునా నది పరివాహక ప్రాంతంలోని జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొందరు పిల్లా పాపలతో సహా ఢిల్లీ వీధుల్లో నివాసం ఏర్పరచుకున్నారు. 

హర్యానాలో భారీ వర్షాలతో యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోంది. హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి నీళ్లు వదులుతున్నారు. యుమునా నది డేంజర్ మార్క్ దాటడంతో పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కేజ్రీవాల్ సర్కార్ తెలిపింది. నదిలో నీటి మట్టం పెరగడం వల్ల వరద ముప్పు లేదని ప్రకటించింది.