ఢిల్లీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

ఢిల్లీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఈ లిస్ట్ లో దేశ రాజధాని ఢిల్లీ కూడా చేరింది. ఢిల్లీలో రేపటి నుండి (డిసెంబర్ 27) రాత్రి 11:00 నుండి ఉదయం 5:00 వరకు రాత్రి కర్ఫ్యూ విధించబడుతుందని ప్రకటించింది ప్రభుత్వం. ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 290 కోవిడ్ కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. నిన్న ఒక్కరోజే  16 శాతం పాజిటివ్ రేటు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.5 శాతంగా ఉంది..