ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ

ఢిల్లీ: ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు ఒకటి రెండు రోజులు లేటైతేనే సహించలేం అలాంటిది ఓ ఆన్ లైన్ సంస్థ తన కస్టమర్ అడిగిన ప్రొడక్ట్ ను డెలివరీ చేసేందుకు  నాలుగేళ్లు పట్టింది.  తాజాగా ఈ ఆర్డర్ అందుకున్న ఆ వక్తికి నోట మాటరాలేదట. దీంతో ఈ విషయాన్ని ఆన్ లైన్లో షేర్ చేశాడు.

ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ 2019లో అలీ ఎక్స్ ప్రెస్ లో తాను ఓ వస్తువును ఆర్డర్ చేశానని తెలిపారు.  ఈ గ్యాప్ లో కరోనా రావడం ఆతర్వాత భారత్ లోఈ యాప్ సేవలుబ్యాన్  చేయడం కూడా జరిగిపోయాయి. దీంతో ఆశలు వదులుకున్నానని చెప్పాడు. కానీ ఇన్నేళ్లకు యాప్ తనకు ఐటెం డెలివరీ చేసి షాకిచ్చిందని తెలిపాడు.

                              ALSO READ:పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు