భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

  • ఢిల్లీలోని మోడల్‌‌‌‌ టౌన్‌‌‌‌లో ఘోరం

న్యూఢిల్లీ: భార్య వేధింపులతో బెంగళూరు టెక్కి అతుల్ సుభాశ్ సూసైడ్ ఉదంతం మరవకముందే మళ్లీ అలాంటి ఘటనే దేశ రాజధానిలో  జరిగింది. ఢిల్లీలో  ఫేమస్ అయిన వుడ్‌‌‌‌బాక్స్ కేఫ్‌‌‌‌ సహ వ్యవస్థాపకుడు పునీత్‌‌‌‌ ఖురానా(40) భార్య వేధింపులు భరించలేక మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మోడల్‌‌‌‌ టౌన్‌‌‌‌లోని కళ్యాణ్‌‌‌‌ విహార్‌‌‌‌ ఏరియాలో ఉన్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. మనికా జగదీశ్ పహ్వా అనే మహిళతో కలిసి పునీత్ ఖురానా ఢిల్లీలో వుడ్‌‌‌‌బాక్స్ కేఫ్‌‌‌‌ ప్రారంభించాడు. వీరిద్దరూ  2016 లో పెండ్లి చేసుకున్నారు. అయితే, వైవాహిక సమస్యలతో పాటు బిజినెస్​కు సంబంధించిన విబేధాలతో దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

ఈ వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పునీత్‌‌‌‌ ఫోన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో దంపతుల గొడవకు సంబంధించిన16 నిమిషాల నిడివి గల కాల్ రికార్డింగ్ ఉందని వివరించారు. వ్యాపార ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ జరిగినట్లు ఆధారాలు కూడా లభించాయని చెప్పారు. పునీత్‌‌‌‌ ఖురానా ఆత్మహత్య కేసులో ఆయన భార్య మనికా జగదీశ్ పహ్వాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. దర్యాఫ్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. భార్య, ఆమె తల్లిదండ్రులు పెట్టే టార్చర్ వల్లే పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు.