భారత్ లోకి వచ్చింది.. ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలి..డీజీహెచ్‌ఎస్ హెచ్చరిక

చైనా వైరస్...  HMPV కేసులు పెరుగుతున్నాయి.  భారతదేశంలోకి వ్యాపించడంతో ఢిల్లీలోని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.  ప్రజలు ఇలాంటి వైరస్ ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 

డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  ఇన్‌ఫ్లుఎంజా ...  తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (SARI) సమస్యల పట్ల  ప్రజలను అప్రమత్తం చేయాలని అన్ని ఆసుపత్రులకు సూచించింది. ఆస్ప్రత్రులో వైద్యానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచింది.  దగ్గు..జలుబు.. జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  తెలిపింది. 

Also Read : బెంగళూరులో తొలి HMPV కేసు

 అనుమానాస్పద కేసుల  విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించింది.  రోగులకు పారాసెటమాల్, యాంటిహిస్టామైన్లు, బ్రోంకోడైలేటర్లు ...  దగ్గు సిరప్ ..  మందులతో పాటు ఆక్సిజన్ అందించాలని   డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆసుపత్రులకు సూచించింది. జలుబు మాదిరిగానే ...  శ్వాసకోశం ద్వారా ఈ వైరస్  శరీరంలోకి ప్రవేశించి.. వివిధ అవయాల పనితీరును  ప్రభావితం చేస్తుందని డిజిహెచ్‌ఎస్ తెలిపారు. HMPV వైరస్ మొదటి సారిగా 2001 లో నెదర్ ల్యాండ్స్ లో  దీనిని కనుగొన్నారు. ఈ వైరస్ .. దగ్గు.. తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది . అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమని గుర్తించింది.