అమెజాన్‌ కేసులో స్టేకు ఢిల్లీ హైకోర్టు నో

అమెజాన్‌ కేసులో స్టేకు ఢిల్లీ హైకోర్టు నో
ఫ్యూచర్‌‌–రిలయన్స్‌ కేసులో తీర్పు న్యూఢిల్లీ : అమెజాన్​ కేసులో ఫ్యూచర్​ గ్రూప్​కు అనుకూలంగా స్టే ఉత్తర్వులు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. తనపై స్టాట్యుటరీ అథారిటీస్​ వద్ద భవిష్యత్​లో కంప్లెయింట్స్​ ఇవ్వకుండా అమెజాన్​ను ఆపమని కోరుతూ ఫ్యూచర్​ రిటెయిల్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్​ డీల్​కు అడ్డంకులు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఫ్యూచర్​ గ్రూప్​ ఈ కేసును వేసింది. అయితే స్టాట్యుటరీ అథారిటీస్​ నిబంధనలకు అనుగుణంగా తమ నిర్ణయం తాము తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. రిలయన్స్​ రిటెయిల్​తో ఫ్యూచర్​ రిటెయిల్ ట్రాన్సాక్షన్​ చెల్లుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రిలయన్స్​ రిటెయిల్​తో డీల్​ ఖరారు చేసుకోవడానికి వీలు లేదంటూ సింగపూర్​ ఇంటర్నేషనల్​ ఆర్బిట్రేషన్​ సెంటర్​ (సియాక్​) ఆదేశించడంతో ఫ్యూచర్​ రిటెయిల్​ లిమిటెడ్​ ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు వేసింది.​ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్​ ఇచ్చిన అవార్డు చెల్లుతుందని కూడా ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.