యమునా నది రివర్ ప్రక్షాళణకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. 70 ఏళ్లలో యమునా నది పరిరక్షణకు అధికార బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. 2024 నాటికి యమునా నది ప్రక్షాళన చేసి తీరుతామని ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హామీని నిలబెట్టుకుంటామన్నారు. దీనికి సంబంధించి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
యుమనా నది ఇవాళే కాలుష్యం బారిన పడినట్టు చెబుతున్నారని అన్నారు సీఎం కేజ్రీవాల్. 75 ఏళ్లుగా ఇట్లానే ఉందన్నారు. ఢిల్లీలో అధికారం అనుభవించిన బీజేపీ, కాంగ్రెస్‌లు యమునా జలాల కాలుష్య నివారణకు చేసిందేమీ లేదని.. మరి రెండ్రోజుల్లో మొత్తం క్లీన్ చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 6 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్ చేపట్టామని చెప్పారు సీఎం కేజ్రీవాల్. అంతేకాదు యమునా నది పనులను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
