దోశ అంటే చాలామందికి ఇష్టం. ఎలాంటి దోశ వేసిన చకచక లాగించేస్తారు. ఆనియన్ దోశ,రవ్వ దోశ, ప్లెయిన్ దోశ, ఉప్మాదోశ, ఎగ్ దోశ ఇలా రకరకాల వెరైటీ దోశలు కూడా మనకు దొరుకుతాయి. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సరికొత్త ఆలోచన చేశాడు. దోశ తిన్నోళ్లకు డబ్బులు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.అయితే వందో వేయ్యో కాదు.. ఏకంగా 71వేల నగదు బహుమతి అందిస్తానని చెప్పాడు. ఢిల్లీకి చెందిన స్వామి శక్తి సాగర్ అనే వ్యక్తి సరికొత్త చాలెంజ్ చేశాడు. పది అడుగుల పెద్ద దోశను తయారు చేయంచాడు. ఎవరైతే ఈ దోశను కేవలం 40 నిమిషాల్లో తినేస్తారో.. వారికి ఏకంగా 71వేల రూపాయలు ఇస్తానన్నాడు.
ఈ ఛాలెంజ్ కోసం పది అడుగుల పెద్ద పెనం తయారు చేయించాడు. ఈ పెనంపైపది అడుగుల పెద్ద దోశను తయారు చేయించాడు. ఈ దోశ తయారు చేసేందుకు కనీసం ఏడు నుంచి 8 నిమిషాల టైం పడుతుందని సాగర్ చెప్పాడు. నెల క్రితమే తాము ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశామన్నారు. ఇప్పటివరకు దాదాపుగా 26 మంది ఈ ఛాలెంజ్ స్వీకరించాన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇందులో గెలవలేకపోయారన్నారు. పది పన్నేండేళ్లుగా హోటల్‌కు వచ్చే కస్టమర్లు సైతం ఈ దోశ ఛాలెంజ్‌లో పార్టిస్పేట్ చేసి ఓడిపోయారు. కానీ దోశను మాత్రం ఎవరూ తినలేకపోయారు. అయితే దోశ తయారీ విషయంలో నాణ్యత పాటిస్తున్నామన్నారు నిర్వాహకులు. ఈ పది అడుగుల దోశ ధర రూ. 1500. మరి ఈ దోశ చాలెంజ్‌ను ఎవరు గెలుస్తారో చూడాలి.
Delhi eatery offering Rs 71,000 for finishing 10-ft-long dosa in 40 minutes
— ANI Digital (@ani_digital) February 2, 2022
Read @ANI Story | https://t.co/um4ElwVWNY pic.twitter.com/Wl06A0E3pR
