ఢిల్లీకి చెందిన 200మంది పోలీసులు పనులన్నీ పక్కన పెట్టి ఓ నిందితుడి కోసం రెక్కీ నిర్వహించారు. ఆ రెక్కీ నిర్వహించింది టెర్రరిస్ట్ కోసమో, హంతకుడి కోసమో కాదు.. ఓ ఎస్సై కోసం. ఢిల్లీకి చెందిన పునీత్ గ్రెవాల్ అనే ఎస్సై మహా కీచకుడు. ఒంటరిగా ఉన్న మహిళల్ని టీజ్ చేసేవాడు. అసభ్యంగా ప్రవర్తించేవాడు. అసలే పోలీస్ ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనని బాధితులు బయపడ్డారు. కానీ ఎట్టకేలకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సైక్లింగ్ చేసే సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్క ప్రాంతంలోనే కాకుండా నాలుగు ప్రాంతాల్లో పునీత్ పై ఒకే రోజు నాలుగు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పునీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 200మంది పోలీసులు 200సీసీటీవీ కెమెరాల ను చెక్ చేశారు. చివరికి పునీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై నడిపిన కారు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదని గుర్తించారు. కాగా పునీత్ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
