బీజేపీ దిగజారుతోంది.. కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం

  • ప్రెస్ మీట్​లో ఢిల్లీ సీఎం ఆతిశి కంటతడి
  • బీజేపీ నేత కామెంట్లతో మనస్తాపం

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఆతిశి మీడియా ముందు కంటతడి పెట్టారు. మాజీ ఎంపీ, కల్కాజీ అసెంబ్లీ అభ్యర్థి రమేశ్ బిధూరి తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలపై స్పందిం చారు. ‘‘నా తండ్రిని బీజేపీ నేత ఘోరంగా అవమానించారు. 

రాజకీయాల కోసం బీజేపీ నేతలు దిగజారి పోతున్నారు. రమేశ్​ బిధూరి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. నా తండ్రి ఒక టీచర్. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంతకు దిగజారుతారా? ఒక వృద్ధుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు” అని  ఆతిశి భావోద్వేగానికి లోనయ్యారు.

 రాజకీయాల కోసం ఆతిశి తన తండ్రిన మార్చేసిందని ఎన్నికల ప్రచారంలో రమేశ్ భిదూరి విమర్శించారు. ఇప్పటి వరకు ఆతిశి మార్లెనాగా ఉన్న ఆమె ఇప్పుడు ఆతిశి సింగ్ గా మారిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆతిశి విలపించారు.