న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు తగ్గితే ఆంక్షలను ఎత్తేస్తామని హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ చెప్పారు. కేసులు స్థిరంగా ఉన్నాయని, రెండు, మూడు రోజుల్లో కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ముంబైలో తగ్గినట్టే ఢిల్లీలో కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీలో కేసులు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తోందని.. రెండు, మూడు రోజుల్లో తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ప్రస్తుతం 25% పాజిటివ్ రేటు కొనసాగుతోందని, అయితే దాని ఆధారంగా కేసులు గరిష్ట స్థాయికి చేరాయని చెప్పలేమన్నారు. హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య నిలకడగా ఉందన్నారు. కరోనా సోకినోళ్లలో చాలా తక్కువ మందికే ఆక్సిజన్ అవసరం పడుతోందని చెప్పారు. కాగా, ఢిల్లీలో డైలీ కేసులు కొన్నిరోజులుగా 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.
