IPL 2025: ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం.. వెంటనే రిజిస్టర్ చేసుకోండి

క్రీడాభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. మ‌రో 6 రోజుల్లో జెడ్డా వేదిక‌గా వేలం పాట షురూ కానుంది. ఇప్ప‌టికే వేలం జరిగే తేదీలు ప్రకటించిన బీసీసీఐ.. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుద‌ల చేసింది. తాజాగా, ఈ మెగా వేలానికి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) యాజమాన్యం ఓ శుభవార్తను పంచుకుంది. ఉచితంగా మెగా వేలంలో పాల్గొనే అవకాశాన్ని అభిమానులకు కల్పించింది. 

ఖర్చులన్నీ ఫ్రాంచైజీవే.. 

జెడ్డా నగరాన్ని చూడాలనుకున్నా.. ఐపీఎల్ వేలంలో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకున్నా ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉండదు. రాను.. పోను విమాన టికెట్లు, తినే తిండి దగ్గర నుండి బస చేసే హోటల్ ఖర్చులు వరకూ అన్నీ ఫ్రాంచైజీనే భరించనుంది. అభిమానులు చేయాల్సిందిలా.. తమ పేరు రిజిస్టర్ చేసుకోవడమే. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారిలో ఓ పది మందిని ఎంపిక చేసి తమతోపాటు ఐపీఎల్ వేలం జరిగే జెడ్డా నగరానికి వెంటబెట్టకెళ్లనుంది. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..? ఏయే వివరాలు పొందుపరచాలి అనేది తెలుసుకుందాం..

అర్హతలు

  • 18 ఏళ్లు పైబడి ఉండాలి 
  • వ్యాలిడ్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. 
  • మీ పూర్తి పేరు, మొబైల్ నెంబర్, జెండర్, వయస్సు, వృత్తి, ఇ-మెయిల్ ఐడీ, మీరు ఉంటున్న నగరం వంటి వివరాలు పొందు పరచాలి.  
  • చివరగా మీరు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని ఎందుకు ఇష్టపడతారనేది వీడియో రూపంలో తెలియజేయాలి. ఈ వీడియో నిడివి నిమిషాలోపే ఉండాలి. 

రిజిస్టర్ చేయాలనుకున్న వారు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్ లో ఉన్న ప్రకటనను చూడగలరు.

వేలం ఎప్పుడంటే..?

 ఐపీఎల్ మెగా వేలం న‌వంబ‌ర్ 24, 25 తేదీలలో జెడ్డా వేదికగా మొద‌ల‌వ్వ‌నుంది. ఈ వేలానికి 1,574 మంది క్రికెట‌ర్లు పేర్లు న‌మోదు చేసుకోగా.. వ‌డ‌బోత అనంత‌రం 574 మంది మాత్ర‌మే వేలంలో నిలిచారు. వీరిలో 81 మంది ఆట‌గాళ్లు రూ.2 కోట్ల క‌నీస ధ‌రకు తమ పేరు నమోదు చేసుకున్నారు.

ALSO READ | AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్