ఢిల్లీ బీజేపీ నేత తజీందర్ బగ్గాకు హర్యానా హైకోర్టులో ఉపశమనం లభించింది. నిన్న అర్ధరాత్రి న్యాయస్థానంలో తజిందర్ పై విచారణ సాగింది. ఈ నెల 10వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. బగ్గాపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని పంజాబ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మొహాలీలోని ఒక కోర్టు తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను సవాల్ చేస్తూ.. శనివారం బగ్గా హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్ధరాత్రి వరకు విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ యువ విభాగం నాయకులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బగ్గా రెచ్చగొట్టే కామెంట్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పంజాబ్ పోలీసులు తజిందర్ పై కేసు నమోదు చేశారు. శుక్రవారం (ఈ నెల 6వ తేదీ ) బగ్గాను అరెస్ట్ చేసి, తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అతడిని బలవంతంగా తరలిస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందంటూ తెలిపారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Punjab HC directs police not to take coercive action against Tajinder Bagga until next hearing, says Tejasvi Surya
— ANI Digital (@ani_digital) May 7, 2022
Read @ANI Story | https://t.co/HmfdsB8gxq
#TejasviSurya #TajinderBagga #PunjabHC pic.twitter.com/dnWsr6FXJs
మరిన్ని వార్తల కోసం..
నిజామాబాద్ సీపీ ఆఫీస్ ముందు ఎంపీ అర్వింద్ ధర్నా
