రోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో అరెస్ట్ అయిన సైంటిస్ట్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా హ్యాండ్ వాష్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడ్ని వెంటనే పోలీసులు ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శనివారం రాత్రి భరత్ వాష్ రూం హ్యాండ్ వ్యాష్ లిక్విడ్ తాగి భరత్ అచేతనంగా పడిపోయాడు. దీంతో కాసేపటి తర్వాత అక్కడున్న పోలీసులు అతడ్ని గుర్తించారు. వెంటనే అతడ్ని పైకి లేపి ఏమైందని అడిగారు. కడుపు నొప్పిగా ఉందని.. వాంతులు అయ్యాయిన భరత్ చెప్పుకొచ్చాడు. వెంటనే అతడ్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కు తరలించినట్లు సీనియర్ అధికారులు చెప్పారు.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో స్పెషల్ సెల్ పోలీసులు ఓ డీఆర్డీవో శాస్త్రవేత్త భరత భూషణ్ ను అరెస్టు చేశారు. ప్రత్యర్థి లాయర్‌తో గొడవ ఉన్న నేపథ్యంలో ఆ శాస్త్రవేత్త పేలుడు కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డిసెంబర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబర్ 102లో తక్కువ స్థాయి తీవ్రతతో పేలుడు జరిగింది. అయితే ఈ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి డీఆర్డీవో శాస్త్రవేత్త అని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. రెండు సార్లు అతను కనిపించాడని, ఒకసారి పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగుతో.. రెండవ సారి బ్యాగు లేకుండా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేషన్‌లో ఉన్న డీఆర్డీవో శాస్త్రవేత్త.. లాయర్‌ను చంపాలని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితుడిపై సదురు లాయర్ పది కేసులు నమోదు చేశాడని, అసహనానికి గురైన అతను ప్రతీకారంతో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి
