రిలయన్స్‌ కు ‘డిఫాల్ట్‌ ’ షాక్‌

రిలయన్స్‌ కు ‘డిఫాల్ట్‌ ’ షాక్‌

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కు మరో షాక్ తగిలింది. కేర్‌ రేటింగ్స్‌ ఈ కంపెనీ రేటింగ్‌‌ను ‘డిఫాల్ట్‌ ’కు తగ్గించింది. అంటే రిలయన్స్‌ క్యాపిటల్‌ బాకీపడ్డ రూ.93,900 కోట్లను చెల్లించే అవకాశం లేనట్టే! దీంతో ఎన్‌‌బీఎఫ్‌ సీల లిక్విడిటీలపై మరోసారి ఆందోళనలు మొదలయ్యే ప్రమాదముందని ఎకనమిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది వరకు రిలయన్స్‌ క్యాపిటల్‌ కు ‘బీబీ’ రేటింగ్‌‌ ఉండగా, కేర్‌ దానిని తాజాగా డిఫాల్ట్‌ కు మార్చింది. ఈ కంపెనీ పలువురు లెండర్ల ఎన్సీడీల కూపన్‌‌ చెల్లింపులను ఆలస్యం చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ నెల 20న ప్రకటించింది. ఈ విషయమై రిలయన్స్‌ క్యాపిటల్‌ ఆఫీసర్‌ ఒకరు స్పందిస్తూ కేర్‌ రేటింగ్‌‌ను డౌన్‌‌గ్రేడ్‌ చేయడం వల్ల కంపెనీ సెక్యూరిటీస్‌ లో ఇన్వెస్ట్‌ చేసిన లక్షలాది రిటైల్‌ , ఇన్‌‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందని అన్నారు.

ఐఎల్‌ ఎఫ్‌ ఎస్‌ దివాలా తరువాత అప్పు దొరక్క ఇబ్బందులు పడుతున్న ఎన్‌‌బీఎఫ్‌ సీలకు రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా తీస్తే మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ ఆస్తులను అమ్మి అప్పులను తీర్చడానికి
గత ఏడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో కంపెనీ కొంతమేరకే విజయం సాధించింది. దీంతో షేరు ధర 90 శాతానికిపైగా పడిపోయింది. ఎరిక్సన్‌‌కు డబ్బు చె ల్లించకుం టే జైలుకు పంపిస్తామని అనిల్‌ ను సు ప్రీంకోర్టు హెచ్చరిం చగా, అన్న ముకేశ్‌ అంబానీ ఆదుకోవడం తెలిసిం దే. మరికొన్ని కంపెనీలు కూడా రిలయన్స్‌ క్యాపిటల్‌ పై ఎన్సీఎల్టీలో కేసులు వేశాయి. కూపన్‌‌ చె ల్లింపులు ఆలస్యం కావడంపై కంపెనీ స్పందిస్తూ సాం కేతిక సమస్యల వల్లే ఇలా జరిగిం దని వివరణ ఇచ్చింది. మరునాడే డబ్బు కట్టామని తెలిపింది. దీనిని కేర్‌ రేటింగ్స్‌ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది.