దీపావళి రోజు టపాసులు ఎందుకు పేల్చాలి... సైన్స్ చెబుతున్న సైంటిఫిక్ రీజన్ ఇదే...

భారతీయులు జరుపుకొనే ప్రతి పండుగకు ఓ పక్క పురాణగాథ... మరో పక్క శాస్త్రీయ కోణం రెండూ ఉంటాయి.  అయితే ఎవరి వాదన వారు వాదిస్తుంటారు.  మనము ఎవరినీ తప్పుపట్ట లేము కానీ... రెండు విషయాలను భావితరాలకు అందించాల్సిన అవసరముంది.  దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చడం... దీపాలు వెలిగించడం... వస్తున్న ఆచారం.  అయితే దీనికి శాస్త్రీయ కోణం పరంగా శాస్త్రవేత్తలు  ఏం చెబుతున్నారో ఒకసారి  తెలుసుకుందాం,. . . .

భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక శాస్త్రీయ దృక్పథం ఉంది. హిందువుల జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి (Diwali) ఒకటి. ఈ పండుగకు శాస్త్రీయ కోణంలో (Diwali Scientific Reason) చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం (Rainy Season) తర్వాత వచ్చే పండుగ దీపావళి. కాబట్టి వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి.. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల పలు వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యానికి గురువుతారు. అలాగే, వర్షాకాలం ముగిసి శీతకాలం (Winter) ఆరంభం కావడంతో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు (Diyas) వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దానిలో పడి చనిపోతాయి. ఆ రోజు కాల్చే టపాసులు, మతాబుల నుంచి వెలువడే పొగ దోమలు వంటి క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.


అలాగే, దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. దీంతో విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. ఫలితంగా రక్తకణాలు ఉత్తేజితమై వ్యాధినిరోధకత వృద్ధి చెందుతుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావారణాన్ని మెరుగుపరుస్తుంది. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.

దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కోణం కూడా ఉంది. స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో నెగెటివిటీని తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా చీకటి మాయమై వెలుగులు ప్రసరిస్తాయి.

కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పు వంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. గాలి, నీరు, నేల కాలుష్యంతో ముడిపడి ఉన్న ఈ యుగంలో సహజ సిద్ధంగా బ్యాక్టీరియా ఉత్పరివర్తనాలను నాశనం చేసే దీపపు మంటల ప్రభావం బలహీనపడింది.

ఇక, చారిత్రకంగా చూస్తే దీపావళి రోజునే హిందూ చక్రవర్తి విక్రమాదిత్య సింహాసనం అధిష్ఠించినట్టు భావిస్తారు. గొప్ప దార్శనికుడిగా భావించే విక్రమాదిత్యుడు.. దానగుణం, ధైర్యసాహసాలు, మేధస్సుతో గుర్తింపు పొందారు. మరోవైపు, జైనమతంలో దీపావళి పండుగను 24వ, చివరి జైన తీర్థంకరుడు మహావీరుని ఆత్మ నిర్వాణాన్ని గౌరవ సూచికంగా జరుపుకుంటారు.