Diwali 2024: లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే..

దీపావళి పండుగ..   ఆ రోజున (అక్టోబర్ 31) సిరిసంపదలు ఇచ్చే లక్ష్మీ దేవిని పూజిస్తారు.  పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కొత్త బట్టలుధరించి టపాసులతో సందడి చేస్తారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను రెండు రోజులు( అక్టోబర్ 30,31)  జరుపుకుంటారు. ఆశ్వయుజమాసం కృష్ణ పక్షం చతుర్ధశి మరియు అమావాస్య రోజుల్లో జరుపుకుంటారు.అమావాస్య రోజున ( అక్టోబర్ 31)గణపతికి.. లక్ష్మీదేవికి.. కుబేరునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.  ప్రజలందరూ రంగు రంగుల దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు.  అయితే లక్ష్మీ పూజను ప్రదోష కాలంలో చేయాలని పండితులు చెబుతున్నారు. 

దీపావళి పండుగ తేదీ, ముహూర్తం..

 దీపావళి పండుగను . దృక్ పంచాంగ్ ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31, 2024న ఉదయం 6:22 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 1, 2024న 8 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. లక్ష్మీ పూజ అక్టోబర్ 31 సాయంత్రం 06:52 గంటలకు ప్రారంభమై రాత్రి 08:41 గంటలకు ముగుస్తుంది. చోటి దీపావళిని నరక చతుర్దశి, కాళీ చౌదస్, భూత్ చతుర్దశి, రూప్ చౌదాస్, దీపావళి భోగి అని కూడా పిలుస్తారు.

ALSO READ : ఆధ్యాత్మికం : ఙ్ఞానం అంటే ఏంటీ.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటీ.. జ్ణానం కంటే గొప్పది లేదా..?

దీపావళి పూజా సమయాలు:

  • లక్ష్మీ పూజ ముహూర్తం :  అక్టోబర్ 31 సాయంత్రం 06:52 గంటల నుండి 08:41
  • వ్యవధి :  01 గంటల 50 నిమిషాలు
  • ప్రదోష కాలం: సాయంత్రం 06:10 గంటల నుండి 08:52 ( పూజా సమయం)
  • అమావాస్య ప్రారంభం: అక్టోబర్ 31 ఉదయం 6.22 గంటలు.
  • అమావాస్య ముగింపు: నవంబర్ 1 ఉదయం 8.46 గంటలు.

దీపావళి పండగను చెడుపై మంచి విజయం సాధించినందుకు జరుపుకుంటారు.. నరకాసురుడు అనే రాక్షసుడిని ఆయన తల్లి సత్యభామ చంపిన రోజు.. అంతేకాక త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసి..దీసాలు.. వెలిగించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.