మాలల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి : మహానాడు నాయకులు దీపక్ ఆకాశ్

  • 16న సంగారెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాక

జహీరాబాద్, వెలుగు : మాలల హక్కుల సాధన కోసం ఈనెల 16న సంగారెడ్డిలో నిర్వహిస్తున్న మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు దీపక్ ఆకాశ్, బాలయ్య, నర్సింలు, రజనీకాంత్, శ్రీనివాస్ కోరారు. గురువారం జహీరాబాద్ లో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించే మాలల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతారని వారు పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలోవర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మల్లెపల్లి లక్ష్మయ్య, గోపినాథ్, నారాయణ, భాస్కర్, సర్వయ్య, లక్ష్మీ నారాయణ పాల్గొంటారని తెలిపారు.