మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ

ఆమనగల్లు, వెలుగు: కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్  మున్షీ బుధవారం కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. నాగర్ కర్నూల్  సమావేశానికి వెళ్తున్న ఆమెకు మైసిగండిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమెను సన్మానించారు. నాగర్ కర్నూల్  జడ్పీ వైస్  చైర్మన్  బాలాజీ సింగ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, అనంతరెడ్డి, భిక్యా నాయక్, యాట నరసింహ,  గుర్రం కేశవులు, కృష్ణ నాయక్, వెంకటేశ్  పాల్గొన్నారు.