అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం

హైదరాబాద్:గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆస క్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, సినీ హీరో అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించగా.. ఆయనకు భంగపాటు ఎదురైంది. ఇవాళ గాంధీభవన్ కు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డిని ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన్ని కలిసేందుకు దీపా దాస్ విముఖత వ్యక్తం చేశారు.

Also Read :- ఎర్రచందనం స్మగ్లర్కు నేషనల్ అవార్డా.?.. పోలీస్ విలనా

ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యం లో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో చంద్రశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడానికి నిరాకరించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా.. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తానూ అధికారంలో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో సంచనలన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ వివాదంపై సప్నదించిన ఏసీపీ విష్ణుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్ హెచ్చరించారు ఏసీపీ . అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు.