సెప్టెంబర్ 19న విడుదల కానున్న డిసెంబర్ నెల టీటీడీ దర్శనం టికెట్లు.

డిసెంబర్ నెలలో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో  డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకొవడానికి వెళ్లేవారికి సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్లు సెప్టెంబర్ 19వ తారీఖున విడుదల చెయ్యనున్నారు. అయితే ఆన్లైన్ లో స్వామివారి దర్శనం టికెట్లు విడుదల చేసిన గంటల వ్యాయ్వధిలోనే సేల్ అయిపోతున్నాయి. 

అయితే ప్రతీఏటా సెప్టెంబర్ 16న నుంచి 18వరకూ 3 రోజులపాటు ఘనంగా నిర్వహించే పవిత్రోత్సవం వేడుకలుప్రారంభమయ్యాయి. దీంతో పవిత్రోత్సవం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ కల్యాణోత్సవం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను రద్దు చేశారు.

మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ వేడుకలలో ఈరోజు  మొదటి రోజున కావడంతో పవిత్ర ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈనెల 17వ తారీఖున పవిత్ర సమర్పణ, 18వ తారీఖున ప్రుణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనేవారికి రెండు లడ్డూలు, రెండు వడలను ప్రసాదంగా అందజేస్తారు.