గుణ జిల్లాలో విషాదం: బోరుబావిలో పడిన బాలుడి మృతి

భోపాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో140 అడుగుల బోరుబావిలో పడిన 10 ఏండ్ల బాలుడు చనిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 16 గంటలు శ్రమించి బాలుడిని బయటికి తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గుణ జిల్లాలోని పిప్లియా గ్రామంలో శనివారం సాయంత్రం సుమిత్ మీనా అనే బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న 140 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పక్కనే గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తెచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.