కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల వాడకానికి డీసీజీఐ అనుమతి

కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల వాడకానికి  డీసీజీఐ అనుమతి
దేశంలో కరోనా వ్యాక్సిన్ల వాడకంపై కీలక ప్రకటన చేసింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలిపింది డీసీజీఐ. వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని చెపారు డ్రగ్ కంట్రోల్ జనరల్ VG. సోమాని. ఇక డీసీజీఐ అనుమతిచ్చిన వ్యాక్సిన్లలో కోవ్యాగ్జిన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. దీన్ని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ, ICMRతో కలిసి అభివృద్ధి చేశాయి. రెండోది ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను.. సీరమ్ ఇనిస్టిట్యూట్ మన దేశంలో ఉత్పత్తి చేస్తోంది. DCGI అనుమతితో వారంలోపే వ్యాక్సిన్ జనానికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు నిపుణులు. టెస్టుల్లో రాణించడం నటరాజన్‌‌కు సవాలే