కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసుల మిక్సింగ్ పై అధ్యయనానికి అనుమతిచ్చింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI. తమిళనాడులోని వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రయోగాలు జరుగుతాయని తెలిపింది. డోసుల మిక్సింగ్ కు అనుమతివ్వాలని జూలై 29న DCGIకి సూచించింది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్స్ పర్ట్స్ కమిటీ. దీంతో డోసుల మిక్సింగ్ అధ్యయనానికి DCGI ఓకే చెప్పింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో 18 మందిపై డోసుల మిక్సింగ్ ప్రయోగం జరిగింది. ఇప్పుడు DCGI అనుమతితో పెద్దసంఖ్యలో వాలంటీర్లపై ప్రయోగాలు జరగనున్నాయి. డోసుల మిక్సింగ్ తో ఇమ్యూనిటీ పెరుగుతుందని ఇప్పటికే ICMR స్టడీలో తేలింది.
