జోగులాంబను దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామిని గురువారం మహబూబ్​నగర్  డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.పుష్కర ఘాట్​ పరిశీలనజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి పుష్కర ఘాట్ లో గదుల నిర్మాణం కోసం అధికారులు స్థలాన్ని పరిశీలించారు.

ఈవో పురేందర్ కుమార్, తహసీల్దార్ మంజుల, మున్సిపల్  కమిషనర్  సరస్వతి, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్  శర్మ, టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.