ప్రైవేట్​కు ధీటుగా గవర్నమెంట్ ​స్కూల్స్

  • డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి 

గజ్వేల్​(వర్గల్), వెలుగు: ప్రైవేట్​స్కూల్స్​కు ధీటుగా గవర్నమెంట్​స్కూళ్లను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం బొర్రగూడెం ప్రైమరీ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ..ఒక గవర్నమెంట్ స్కూల్​కు  బస్సు ఏర్పాటు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడం నిజంగా ఆభినందనీయమన్నారు.

స్కూల్​లో ఉన్న గదుల కొరతను పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు గజ్వేల్,- తూప్రాన్ రోడ్డు నుంచి వర్గల్​ మండలం చందాపూర్  కు వెళ్లే దారిలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. పంచాయతీరాజ్ డీఈ ప్రభాకర్ తో మాట్లాడి దారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట రంగారెడ్డి, మోహన్, రహీం, చెన్నయ్య, కరుణాకర్ ఉన్నారు.