వీ6పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : ​ఆంజనేయులు గౌడ్​

  • మెదక్​ డీసీసీ ప్రెసిడెంట్ ​ఆంజనేయులు గౌడ్​

శివ్వంపేట, వెలుగు : బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​ వీ6 వెలుగుపై తప్పుడు ప్రచారాలు, మానుకోవాలని డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఆవకశ్యకతను, ప్రజల ఆకాంక్షను వీ6 బలంగా వినిపించిందని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల పక్షాన పనిచేసే ఛానల్ వీ6, పత్రిక వెలుగు అని స్పష్టం చేశారు.

 ట్రిపుల్ఆర్, కాళేశ్వరం, కొండపోచమ్మ, భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాటం చేసిన ఛానల్ అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను, అవినీతి, భూకబ్జాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నందున ఓర్వలేక కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది నిరంతరం ప్రజల కోసం పోరాడే కుటుంబమని ఆయనను విమర్శించే స్థాయి కేటీఆర్​ది కాదన్నారు.