సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన సుమారు 40 మందికి సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి రూ.18.35 లక్షలు మంజూరయ్యాయి. మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి  పాల్గొన్నారు.