- 20 నిమిషాలకు ఒకసారి ఆటోమేటిక్ శానిటైనేషన్
- తయారు చేసిన డీసీ2 డిజైనింగ్ కంపెనీ
- దేశంలోనే ఈ తరహా కారు మొదటిది
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా కనిపించేది శానటైజర్, వినిపించేది ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని. ఈ నేపథ్యంలో కరోనా దరికి రాకుండా ప్రముఖ కార్ల డిజైనింగ్ సంస్థ డీసీ2 సరికొత్త కార్ ఇంటీరియర్ డిజైన్‌ను రూపొందించింది. కారులో డ్రైవర్, ఆ పక్క సీటుకు మధ్య ఫిజికల్ డిస్టెంసింగ్ ఉండేలా కొత్త మోడల్‌ను రూపొందించింది. అంతే కాకుండా కారులోనే ఎలక్ట్రికల్ శానటైజర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇలాంటి డిజైన్ తయారు ఇదే మొదటిది అని కంపెనీ చెప్పింది. దానికి సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. కారులోనే ఫిజికల్ డిస్టెంసింగ్ పాటించేలా డ్రైవర్, పక్క సీటుకు మధ్య 6.4 అడుగుల దూరాన్ని పెట్టింది. అంతే కాకుండా మధ్యలో అద్దాన్ని కూడా అమర్చింది. దీంతో పాటు కారులోని నాలుగు వైపుల శానటైజర్లను పెట్టి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కారును క్లీన్ చేసేలా అమర్చింది. కారులో ఎలాంటి వైరస్‌లు ఉండకుండా శానటైజర్ హెల్ప్ చేస్తుంది. ఎస్‌యూవీలు, ఎంపీవీలు, ఫార్చునర్, మెర్సిడెస్ కియా, మహీంద్రా తదితర కార్లలో ఇప్పటికే దీనికి సంబంధించి ట్రైయల్స్ చేశామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. డీసీ2 డిజైనింగ్ కార్లను మనకు కావాల్సినట్లు మేక్ ఓవర్ చేసి ఇస్తుది. ఈ సంస్థ చాలా మంది బాలీవుడ్ స్టార్లకు కూడా తమ కార్లను రీమోడల్ చేసి ఇచ్చింది.
