కోల్‌కతా: బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండ్రోజుల కిందటే టీఎంసీలో చేరిన సిన్హాను ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా దీదీ నియమించడం గమనార్హం. టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగానూ యశ్వంత్‌ను మమత అపాయింట్ చేశారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో యశ్వంత్ కేబినెట్ మంత్రిగా పని చేశారు. టీఎంసీ చేరిన అనంతరం సిన్హా మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై జరిగిన దాడి తనను క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వచ్చేలా పురిగొల్పిందన్నారు.
