మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. 277/5 వికెట్లతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 326కు ఆలౌట్ అయ్యింది. అజింక్య రహానే 112, జడేజా57 పరుగులు చేయడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసిస్ బౌలర్లలో స్టార్క్ 3,లైయాన్ 3 , కమిన్స్ 2, హజిల్ వుడ్ 1 వికెట్లు తీశారు.
తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసిస్ బ్యాట్స్ మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మూడో రోజు ఆట ముగిసే సరికి ఆసిస్ సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ఆసిస్ 2 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. నాల్గో రోజు త్వరగా మిగతా నాలుగు వికెట్లు పడగొడితే టీమిండియాకు గెలిచే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో195 పరుగులు చేసింది.
