David Warner: అభిమానులకు సర్ ప్రైజ్.. తెలుగు సినిమాలో వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. అయితే ఆ సినిమా ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ ఓ తెలుగు చిత్రంలో క్యామియో రోల్ చేస్తున్నారంటూ ఇటీవల కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. పుష్ప 2 చిత్రంలోనే ఆయన కనిపించనున్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే, పుష్ప 2లో కాకుండా వేరే చిత్రంలో వార్నర్ క్యామియో చేశారట. 

యంగ్ హీరో నితిన్ హీరోగా ఉన్న రాబిన్‍హుడ్ చిత్రంలో డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. రాబిన్‌హుడ్’ సినిమాలోనే ఆయన నటిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఆ మూవీలో స్పెషల్ పాత్రలో కాసేపు కనిపించనున్నారు. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ సీన్ షూటింగ్ మూడో రోజుల కిందట ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ లొకేషన్ నుంచే ఫోటోలు లీక్ అయ్యాయి.

ALSO READ | ఇది నేను ఎప్పుడూ ఊహించనిది.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంపై చిరు ఆనందం

రిలీజ్ చేసిన చిత్రాల్లో వార్నర్ స్టయిలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. 37 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ తెల్లటి చొక్కాతో షూటింగ్ స్పాట్ లో ఎరుపు హెలికాప్టర్ నుండి దిగి వస్తూ హల్ చల్ చేస్తున్నాడు. పెద్ద లాలిపాప్‌ను పీలుస్తూ సన్ గ్లాస్ పెట్టుకొని అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. గోల్డెన్ తుపాకీతో వార్నర్ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో కొందరిని కాలుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. 

వార్నర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు ఈ ఆసీస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.