CPL 2024 Eliminator: మిల్లర్ ఎక్కడైనా కిల్లరే: ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన దక్షిణాఫ్రికా స్టార్

సౌతాఫ్రికా స్టార్ ఫినిషర్ మిల్లర్ ప్రపంచంలో ఏ లీగ్ ఆడినా తనదైన ముద్ర వేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా ఇతర టీ20 లీగ్ ల్లో ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించడం అతనికి అలవాటే. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కడే తమ జట్టు బార్బడోస్ రాయల్స్ ను గెలిపించి క్వాలిఫయర్ 2 కు చేర్చాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ పై బార్బడోస్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ALSO READ | MS Dhoni: అభిమానికి తీవ్ర నిరాశ.. రోజుల తరబడి నిరీక్షించిన కనికరించని ధోని

5 ఓవర్లకు 60 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 4.2 ఓవర్లలో మ్యాచ్ గెలిచింది. డేవిడ్ మిల్లర్ జట్టుకు విజయాన్ని అందించాడు. 60 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్కడే 17 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లతో పాటు.. 5 సిక్సర్లు ఉన్నాయి. తాను ఎదుర్కొన్న చివరి ఆరు బంతుల్లో ఏకంగా 27 పరుగులు చేయడం విశేషం. గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో మిల్లర్ చివర్లో ఇలాంటి కీలక ఇన్నింగ్స్ లు ఆడి తమ జట్లకు ఊహించని విజయాన్ని అందించాడు. తాజాగా మరోసారి అతని ఇన్నింగ్స్ కు క్రికెట్ అభిమానాలు ఫిదా అయిపోతున్నారు. 

ALSO READ | IPL 2025: వేలంలోకి కేఎల్ రాహుల్‌.. రూ.20 కోట్లైనా తగ్గేది లేదంటున్న RCB!

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పూరన్ 60 బంతుల్లో 91 పరుగులు చేశాడు.ఈ దశలో ఫ్లడ్‌లైట్ లోపం కారణంగా ఆట రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో బార్బడోస్ లక్ష్యాన్ని 5 ఓవర్లకు 60 కు కుదించారు. క్వాలిఫయర్ 1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుతో బార్బడోస్ రాయల్స్ తపడుతుంది.