పైన ఉన్న క్రికెటర్లను గుర్తు పట్టారా..? ప్రతి రోజూ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేసే వారైతే గుర్తుపట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అదే మూణ్ణెల్లకో.. ఆర్నెల్లకో ఒకసారి క్రికెట్ చూసేవారైతే, గుర్తుపట్టడం అసంభవమే.
ఈ ఇద్దరు క్రికెటర్లు మరెవరో కాదండోయ్.. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్. మరి ఆ గెటప్ ఏంటి అంటారా..! వచ్చే ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 'SA20 2025' మూడవ ఎడిషన్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో స్టార్ క్రికెటర్లు ఇద్దరూ ప్రోమోలో ఫన్నీ అవతార్‌లలో కనిపించారు. క్లాసెన్, మిల్లర్లతోపాటు, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, వేన్ పార్నెల్ సైతం ప్రోమో వీడియోలో కనిపించారు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
#BetwaySA20 ?????? ? ?? ???? ?? #WelcomeToIncredible pic.twitter.com/h9un5drip8
— Betway SA20 (@SA20_League) November 7, 2024
క్లాసెన్‌కు రూ.23 కోట్లు
కాగా, టీ20 స్పెషలిస్ట్ బ్యాటరైన క్లాసెన్ కోసం తెలుగు ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించింది. రిటెన్షన్‌లో టాప్ ప్రయారిటీ అతనికే ఇచ్చిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. రాబోవు సీజన్(IPL 2025) కోసం రూ.23 కోట్లకు ఒప్పందం చేసుకుంది.
SA20 టోర్నీలో పాల్గొనే జట్లు
- ప్రిటోరియా క్యాపిటల్స్
- సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
- డర్బన్ సూపర్ జెయింట్స్
- పార్ల్ రాయల్స్
- జోబర్గ్ సూపర్ కింగ్స్
- ఎంఐ కేప్ టౌన్
మొత్తం ఆరు జట్లు తలపడే ఈ టోర్నీ గడిచిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలిచింది. 2023 సీజన్ లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై, 2024 సీజన్‌లో డర్బన్ సూపర్ జెయింట్‌పై ఈస్టర్న్ కేప్ విజయం సాధించింది.