ఏపీలో మే 13న పోలింగ్, అసెంబ్లీ, లోక్ సభకు ఒకే రోజు

2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తీ చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కాశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. భారత్ లాంటి దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాల్ అని అన్నారు. 10లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలు, 55లక్షలకు పైగా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ తో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
మే 13వ తేదీ :  ఏపీ అసెంబ్లీ,పార్లమెంట్ పోలింగ్
జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు

ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25గా ఈసీ ప్రకటించింది. నామినేషన్ ఉపసంహరణకు ఏప్రిల్ 29వరకు గడువు నిర్ణయించింది ఈసీ. ఎన్నికల  నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.