Abu Dhabi T10 League: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. 3 బంతుల్లో 30 పరుగులిచ్చిన శ్రీలంక మాజీ కెప్టెన్

క్రికెట్ చరిత్రలో ఊహించని చెత్త రికార్డ్ ఒకటి నమోదయింది. అబుదాబి టీ10లో భాగంగా శ్రీలంక మాజీ కెప్టెన్ దసున్ షనక కేవలం మూడు బంతులకే 30 పరుగులు సమ్పర్పించుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం అతని చెత్త రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోమవారం(నవంబర్ 25) ఢిల్లీ బుల్స్ వర్సెస్ బంగ్లా టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. షనక బంగ్లా టైగర్స్ తరపున ఆడుతున్నాడు. 

ఇన్నింగ్స్ 9 ఓవర్ లో తొలి బంతులకు 30 పరుగులు వచ్చాయి. మొత్తం ఈ లంక ఆల్ రౌండర్ నాలుగు నో బాల్స్ వేశాడు. దీనికి తోడు ప్రత్యర్థి బ్యాటర్ నిఖిల్ చౌదరి 5 ఫోర్లు.. ఒక సిక్సర్ బాదాడు. దీంతో నాలుగో బంతి పడకుండానే 30 పరుగులు వచ్చి చేరాయి. ఈ తర్వాత మూడు బంతులకు మాత్రం 3 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ ఓవర్ లో మొత్తం 33 పరుగులు వచ్చాయి. బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో షనక 14 బంతుల్లో 33 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

షనక బౌలింగ్ వేసిన తీరుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ గా షనక బ్యాటింగ్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే ఏడాది కాలంగా పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి రాజీనామా చేసినా ప్లేయర్ గాను రాణించలేకపోతున్నాడు. చివరిసారిగా అతను 2024 టీ20 వరల్డ్ కప్ ఆడాడు. లంక తరపున 102 టీ20 మ్యాచ్ లు 71 వన్డే మ్యాచ్ లు ఆడాడు.