ముంబై టెస్టు తొలి రోజు రెండో సెషన్ లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ కు టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ విసుగు తెప్పించినట్టు తెలుస్తుంది. మిచెల్ బ్యాటింగ్ చేస్తుండగా దగ్గరలో సిల్లీ ఫీల్డ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ పదే పదే అరుస్తూ కనిపించాడు. దీంతో మిచెల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ చేష్టలపై విసుగు చెందిన మిచెల్.. అతనిపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ వచ్చి సర్ఫరాజ్ కు సపోర్ట్ చేస్తూ కనిపించాడు.
అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ తో ఈ విషయంలో జోక్యం చేసుకొని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 32వ ఓవర్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో మిచెల్ హాఫ్ సెంచరీతో పోరాడుతున్నాడు. టీ విరామానికి ముందు 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సహచర బ్యాటర్ విల్ యంగ్ తో కలిస్ నాలుగో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Also Read :- మిచెల్ పైనే భారం.. న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టిన జడేజా
మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలతో రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో తొలి రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (53), ఇష్ సోధి (1) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్ టన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ లభించింది.
Warning to Sarfaraz Khan and Rohit Sharma for commenting right before the ball is bowled ⚠️
— Cricket Gyan (@cricketgyann) November 1, 2024
Daryl Mitchell doesn't seem to be impressed with Sarfaraz Khan's constant murmuring from shot-leg at the time
?: JioCinema
.
.
.#indvsnz #3rdtestmatch #rohitsharma #sarfrazkhan… pic.twitter.com/xegDpWrOSq