ఇవాళ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. మహా కుంభాభిషేకంలో భాగంగా అష్టబంధన ద్రవ్యం సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమయంలో అమ్మవారి ఆలయంలో దర్శనాన్ని నిలిపివేస్తామని, భక్తులు సహకరించాలని కోరారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో దర్శనం యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.